08-01-2026 06:56:38 PM
మున్సిపల్ కమిషనర్ రమేష్ కు బీఆర్ఎస్వీ నేత శ్రావణ్ వినతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకుడు కంకటి శ్రీనివాస్ ఆక్రమించిన ఎస్సీ కార్పొరేషన్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలానికి ఇచ్చిన నెంబర్ ను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ విజ్ఞప్తి చేశారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బడికల శ్రవణ్ మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణం చౌడేశ్వరి ప్రాంతంలోఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయానికి చెందిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నంబర్ పొందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆ ఇంటి నంబర్ రద్దు చేయాలని కోరారు. గత 30 సంవత్సరాల క్రితం బెల్లంపల్లి పట్టణంలో SC కార్పొరేషన్ వారు 6 రూముల దుకాణ సముదాయాన్ని నిర్మించారని తెలిపారు. ఆ రూముల వెనక ఉన్న ఖాళీ స్థలాన్ని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు కంకటి శ్రీనివాస్ కబ్జా చేసి ఇంటి నంబర్ (20345) కూడా పొందాడన్నారు. తక్షణమే స్పందించి కమర్షియల్ స్థలాన్ని నివాస యోగ్య స్థలంగా తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించార నీ తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటి నంబర్ (20345) పొందిన తీరు పై వెంటనే విచారణ జరిపి అధికారులను తప్పుడోవపట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి బడికల శ్రావణ్ విజ్ఞప్తి చేశారు.