ప్రజా పక్షపాతి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
మొయినాబాద్, ఫిబ్రవరి 26: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పరితపించే నేత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కొనియాడారు. గురువారం మొయినాబాద్లోని అంజనీదేవి గార్డెన్లో ఎంపీ కొండ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మరియు బీజేపీ నాయకులు ఎంపీతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా దృక్పథం గల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని, ఆయన చేవెళ్ల ఎంపీగా ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని కేఎస్ రత్నం పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ద్వారా 1500 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,500 చొప్పున ఆర్థిక సాయం చెక్కులను ఎంపీ పంపిణీ చేశారు.
అనంతరం మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లను ఎంపీ శాలువాలతో సన్మానించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలని వారికి సూచించారు. వేడుకలకు ముందు హిమాయత్ నగర్ కూడలిలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




