27 February, 2026 | 2:13 AM

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

27-02-2026 12:22 AM

కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

హుజురాబాద్,ఫిబ్రవరి26: (విజయక్రాంతి) వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కరీంనగర్ సిపి గౌస్ అలం అన్నారు. కరీంనగర్ జిల్లాహుజురాబాద్ మండలంలోని కిట్స్ కళాశాలలో హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో గురువారంట్రాఫిక్, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అరైవ్ అలైవ్ అనే మోటో క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని అర్థం అని అన్నారు.

రోడ్డు ప్రమాదాలలో పురుషులు 80శాతం మంది మరణిస్తున్నారని, ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి తప్పకుండా హెలిమేట్ ధరించాలి, పెద్ద వాహనాలు నడిపే వ్యక్తి సీటు బెల్ట్ పెట్టుకోవాలని అన్నారు.అతివేగం ఎ ప్పటికైనా ప్రమాదమే, నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు... ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు.

వాహనాలు ఎంత స్పీడ్ గా నడిపితే ప్రమాదాలు . అనంతరం ఎరుకల గూడెం క్రాస్ వద్ద ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ మాధవి, టౌన్ సిఐ కరుణాకర్, రూరల్ సీఐ వెంకట్ గౌడ్, జమ్మికుంట రూరల్ సీఐ, కిడ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్, హుజురాబాద్ ఎస్‌ఐ యూనస్ అహ్మద్ అలీ, సైదాపూర్ ఎస్త్స్ర స్వాతి, కేశవపట్నం ఎస్త్స్ర శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, కిట్స్ కాలేజ్ విద్యార్థుల,తదితరులు పాల్గొన్నారు.