15 June, 2026 | 7:03 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన గ్రామసభలు

03-04-2026 12:34 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): గ్రామాల్లో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం గ్రామాల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం మధురానగర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి ఎమ్మెల్యే సత్యం ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు, ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం వర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు, మరో 3500 ఇండ్లు రానున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేముల భాస్కర్, ఎంపీడీవో రాము,ఉప సర్పంచ్ తూం రాజు తదితరులు పాల్గొన్నారు.