15 June, 2026 | 8:18 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

బండిని విమర్శించే స్థాయి నీది కాదు

03-04-2026 12:36 AM

చల్ల హరిశంకర్‌పై బీజేపీ కార్పొరేటర్ల ధ్వజం 

ముకరంపుర ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను విమర్శించే స్థాయి నీది కాదంటూ నగర బిఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ పై కరీంనగర్ కా ర్పొరేటర్లు ధ్వజమెత్తారు .గురువారం పత్రిక విలేకరుల సమావేశంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ స్వామిడి వేణు మాట్లాడుతూ గతంలో కెసిఆర్ కరీంనగర్ ను లండన్ చేస్తా , దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు,అని అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన ఘనత మీ నాయకులకె చెల్లిందని విమర్శించారు.

ఇప్పటివరకు కరీంనగర్లో జరిగిన అభివృద్ధి స్మార్ట్ సిటీ ద్వారా సెంట్రల్ ఫండ్స్ తో మాత్రమే అభివృద్ధి జరిగిందని దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మానేరు రివర్ ఫ్రంట్ పై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూములకు విలువ పెరగాలని ఉద్దేశంతో మాత్రమే చేపట్టిన విష యం నగర ప్రజలందరికీ తెలిసిందె అన్నారు. కేబుల్ బ్రిడ్జి ఇప్పటివరకు నాణ్యతలేని కారణంగా ఎన్నోసార్లు మరమ్మత్తులు చేపట్టిన విషయం తెలిసిందే, మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను విమర్శించడం తగదన్నారు.

ప్రజలను మోసపుచ్చడం కేసీఆర్, కేటీఆర్, గంగులకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నగరంలో ఉన్న ప్రతి డివిజన్ కు సమాన స్థాయిలో నిధులు కేటాయించిన ఘనత బిజెపి నగర మేయర్ కే చెందుతుందని చెప్పారు. రెండు చోట్ల ఓడిపోయిన నీవు విమర్శించే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని ,లేనియెడల మేము గతంలోని హెచ్చరించాం అది నిజం చేయాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర్ కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, బండ రమణారెడ్డి ,గాజశివరాం ప్రకాష్ మాసం గణేష్, అనిల్ పాల్గొన్నారు