ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి
07-03-2026 04:20 PM
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ పాల్గొన్నారు. 1, 15 వార్డుల్లో పర్యటించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఒకటో వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి బిల్లులు ఆలస్యమవుతున్నట్లు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, కౌన్సిలర్లు పసుల సుజాత, మానవపాడు నరసింహం, మున్సిపల్ కమిషనర్ యాదగిరి పాల్గొన్నారు.




