తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి
దేవరకొండ,(విజయక్రాంతి): కట్టకొమ్ముతండ గ్రామపంచాయతీ పరిధిలో వడ్డెర కాలనీ తాగునీటి సమస్యను సర్పంచ్ నేనావత్ జ్యోతి పాండు నాయక్ శనివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మోటార్ ఇటీవల కాలిపోవడంతో వడ్డెర కాలనీ ప్రజలకు తాగునీరు,
మొక్కలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో సమస్యను గ్రామ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా గమనించిన సర్పంచ్ జ్యోతి పాండు నాయక్ ప్రజలకు తక్షణమే బోర్ ఏర్పాటు చేయించాడు ఏ సమస్య వచ్చినా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సహాయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సభవత్ లక్ష్మి గోవింద్ నాయక్,వార్డ్ మెంబర్ సాగర్.అఖిల్,వెంకన్న,శంకర్, గోపాల్,గోపి,రాజు తదితరులు పాల్గొన్నారు.




