4 August, 2026 | 1:49 AM

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

04-08-2026 12:00 AM

అధికారుల ఆదేశించిన చేవెళ్ల ఆర్డిఓ పార్థసారధి రెడ్డి

చేవెళ్ళ ఆగస్టు 3 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నుండి రంగారెడ్డి జిల్లా కలెక్ట ర్  ఆదేశాల మేరకు, చేవెళ్ల డివిజన్ పరిధిలో సోమవారం ‘ప్రజావాణి‘ కార్యక్రమం చేవెళ్ళ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మొ దలై మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించారు. అనంతరం ఆర్ డిఓ ప్రకటన విడుదల చేశారు.

డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు హాజరుకాగా ప్రజలనుండి మొత్తం 8 దరఖాస్తులు వచ్చాయన్నారు. రెవెన్యూ శాఖకు 2, పెన్షన్లు సంబందించి 6 దరఖాస్తులు వచ్చాయి. వినతులు సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవలెనని ఆదేశించారు. అధికారులు వెంటనే చర్యలు తీసు కోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.