4 August, 2026 | 1:51 AM

కోటగుళ్లలో ఎన్‌ఆర్‌ఐ పూజలు

04-08-2026 12:00 AM

గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ 

గణపురం, ఆగస్టు 3 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి ఉదయలక్ష్మి జగన్ మోహన్ రావు, దంపతుల కుమార్తె అమెరికా కాలిఫోర్నియాలో నివాసముంటున్న కె.పునీత్, తులసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సాదరంగా ఆహ్వానించి స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేశారు.ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు శాలువాలు పూలమాలతో వారిని ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కోటగుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాలు అందజేసిన పునీత్ తులసి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.