23 August, 2026 | 6:40 PM

ఈనెల 24న ప్రజావాణి కార్యక్రమం

23-08-2026 05:34 PM

ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

 ఉట్నూర్, ఆగస్టు 23(విజయక్రాంతి): ఆదివాసీ తుడుందెబ్బ ధర్నా , ఐటీడీఏ కార్యాల ముట్టడి నేపథ్యంలో  ఈ నెల 24వ తేదీన సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి ఐటిడిఎ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన మారుమూల ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి మధ్యాహ్నం 2 గంటల  తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి రావాలని తెలిపారు.