23 August, 2026 | 6:35 PM

ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలి

23-08-2026 05:30 PM

మఠంపల్లి ఆగస్టు 23(విజయ క్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ జాతరను గ్రామ పెద్ద నాయక్ బానోతు చంద్రు నాయక్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజాలందరీపై ఉండాలని కోరారు. ముందుగా గ్రామంలోని ప్రధాన రహదారి నుంచి మహిళలు భారీ ప్రదర్శనగా డప్పులు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు,మొక్కులు సమర్పించారు.చల్లంగా చూడమ్మా ముత్యాలమ్మ తల్లి అంటూ భక్తులు వేడుకున్నారు. అనంతరం సర్పంచ్లు మాలోతు సక్రు నాయక్,బానోతు అరుణా దేశ్ పాండు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని వర్గాలు కుటుంబ సభ్యులతో తరలివచ్చి అమ్మ వారిని బోనాలు సమర్పించారు.తదుపరి దేవాలయానికి ఎదురుగా ఉన్న పోతురాజుకి భక్తులు మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ నాగరాజు, మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపిటిసి లు, ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.