24 August, 2026 | 8:49 PM

సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల ధర్నా

24-08-2026 06:03 PM

ముకరంపుర, ఆగస్టు 24(విజయ క్రాంతి): సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఉప్పునూటి శ్రీనివాస్, గీట్ల ముకుంద రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు, సీడ్ మిల్లుల, వ్యవసాయ మార్కెట్, తదితర రంగాలలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయ హస్తం మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులు జారీ, 55 సంవత్సరాలు పైబడిన హమాలి కార్మికులకు నెలకు కనీసం 6000 రూపాయలు పెన్షన్, ఐఎల్ఓ తీర్మానం ప్రకారం 50 కిలోల పైబడిన బస్తాలను నిషేధం, హమాలీల అందరికీ ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షులు పిల్లి రవి యాదవ్, ఆవుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు