ఎల్లమ్మకు పూజలు
శేరిలింగంపల్లి బీజేపీ ఇంచార్జి రవికుమార్ ప్రత్యేక పూజ
శేరిలింగంపల్లి,ఆగస్టు 2 (విజయక్రాంతి): ఆషాఢమాస బోనాల మహోత్సవాల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి డివిజన్ మసీద్ బండ హెచ్సీయూ బస్ డిపో ప్రాంతం, ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి,
సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు, శేరిలింగంపల్లి నియోజకవర్గవాసులందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సుభిక్షం నెలకొనాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సందీప్ రెడ్డి, నరసింహ గౌడ్, లింగం గౌడ్, మహేష్ గౌడ్తో పాటు మహేష్ యాదవ్, కిశోర్, మల్లేష్, నరేష్ తదితర నాయకులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.






