3 August, 2026 | 2:35 AM

పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయం

03-08-2026 01:05 AM

ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు హనుమంతరావు

ముషీరాబాద్,ఆగస్టు 2 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య150వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు ఎం. రోహిత్ తదితరులు పాల్గొన్నారు.