బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులు
- మణుగూరు బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై
- జరిగిన దాడినీ ఖండించిన అశ్వారావుపేట మండల నాయకులు
అశ్వరావుపేట నవంబర్ 2 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంను కొందరు కాంగ్రెస్ నాయకులు ధ్వంసం సంఘటన నిరసిస్తూ ఆదివారం మణుగూరు బయలుదేరిన అశ్వరావుపేట మండల బిఆర్‌ఎస్ నాయకులను అడ్డుకొని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో రాష్ట్రంలో రౌడీయిజాం పెరిగిందని,నాయకులు రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు జిల్లాలోని మరుగున పడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఖండిస్తు పార్టీకి పార్టీ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారని, ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని భయపడి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. రేగ.కాంతారావు లేని సమయం చూసి పక్కా ప్రణాళికతో ముందు వేసిన పథకం ప్రకారమే మణుగూరు పార్టీ కార్యాలన్నీ ధ్వంసం చేశారన్నారు.
తక్షణమే ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకుని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు. అరెస్ట్ ఐన వారిలో అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, నియోజక వర్గ నాయకులు యుఎస్. ప్రకాష్ రావు అశ్వారావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు. సంపూర్ణ, నాయకులు దగ్గుమల్ల. నరేంద్ర, నక్కా. రాంబాబు, తాళం.సూరి, ఆరేపల్లి.గోవింద్, నందికోల.వెంకన్న, సోమని. రమేష్, అనుమాస.చరణ్, బోనసీ. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




