రహదారిని పరిశీలించిన కలెక్టర్
ఆళ్లపల్లి ,నవంబర్ 2 (విజయ క్రాంతి) ఆళ్ళపల్లి మండల పరిధిలోని మర్కోడు నుండి కరకగూడెం మండల పరిధిలోని రేగళ్ల గ్రామం వరకు సుమారు పది కిలోమీటర్ల ఉన్న గుట్ట రహదారిని ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ పరిశీలించారు. ఎన్నో ఏళ్ల నుండి ఈ రహదారికి అటవీశాఖ అనుమతులు లేక నిధులు మంజూరైన పనులు నిర్మాణం కాకుండా మధ్యలోనే ఆగిపోయాయి.
సుమారు పది కిలోమీటర్లు ఉన్న రహదారి పూర్తి అయితే మేడారం, మణుగూరు, వరంగల్, చత్తీస్గడ్ వెళ్లడానికి ఖమ్మం టూ మణుగూరు, వెళ్లడానికి ప్రయాణికులకు చాలా సులువుగా ఉంటుంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ రహదారి నిర్మాణం జరగలేదు.
ఆదివారం పినపాక మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్ కరకగూడెం నుండి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఈ రహదారి గుండా వెళ్లారు. కలెక్టర్ పర్యటనతో అళ్లపల్లి కరకగూడెం మండలాల వాసులకు ఆశ కలుగుతుంది. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఈ రహదారికి అటల్ శాఖ అనుమతులు తీసుకువచ్చి రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.




