13 April, 2026 | 4:22 AM

అశ్వాపురం మండల బీఆర్‌ఎస్ నాయకుల తీవ్ర ఆగ్రహం

03-11-2025 12:20 AM

అశ్వాపురం, నవంబర్ 2 (విజయక్రాంతి) : మణుగూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం జరిగిన దాడిపై అశ్వాపురం మండల బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ఈ దాడి పక్కా ప్రణాళికతోనే ప్రభుత్వ పెద్దల అండతో జరిగినదని విమర్శించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఈ దాడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి అద్దం పడుతుంది.

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్రలను తక్షణం ఆపాలి. ఈ దాడి ప్రభుత్వ కనుసన్నల్లో జరగకపోతే, వెంటనే దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు భాగవతపు సతీష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి, కందుల కృష్ణ అర్జున్ రావు, దైద నారాయణరెడ్డి, అశ్వాపురం మాజీ ఉపసర్పంచ్ భూక్యా చందులాల్ కార్యకర్తలతో కలిసిపాల్గొన్నారు.