20 June, 2026 | 7:22 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు యోగా డే

20-06-2026 06:19 PM

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజశేఖర్ విద్యార్థుల చేత వివిధ రకాల ఆసనాలు,సూర్య నమస్కారాలు చేయించారు. ఈ సందర్బంగా వ్యాయామ ఉపాధ్యాయుడు రాజశేఖర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21రోజున జరుగనుంది.

ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడం చేత ముందస్తుగా విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తూ వాటి ప్రయోజనాలు తెలిపారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు యోగా ద్వారా కీళ్ల నొప్పులు తగ్గడం, రక్తప్రసరణ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత వంటి ఆరోగ్య ప్రయోజనాలపై ప్రత్యేక విషయాలు విద్యార్థులకు వివరించారు. చదువు తో పాటు యోగా,క్రీడలలో ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.