18 March, 2026 | 4:08 AM

చేపల మార్కెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

19-07-2024 01:31 AM

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై సీఎం సమీక్ష 

పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచన 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : కొడంగల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. ఇక  నుంచి  కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతీ నాలుగు వారాలకోసారి రివ్యూ చేయనున్నట్లు తెలిపారు.