1 September, 2026 | 11:13 AM

రామోజీరావు అస్తమయం.. రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు

08-06-2024 12:05 PM

హైదరాబాద్: రామోజీరావు అస్తమయంపై ఫిల్మ్ ఛాంబర్ సంతాపం ప్రకటించింది. రేపు సినిమా షూటింగ్ లకు ఫిల్మ్ ఛాంబర్ సెలవు ప్రకటించింది. సంతాప సూచికంగా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ సెలవు ప్రకటించింది. ఈనాడు మీడియా గ్రూప్ చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు రామోజీ రావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.