17 July, 2026 | 8:17 PM

Breaking News

రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •  

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

21-11-2024 07:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంబయ్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్వాగతం పలికారు.

రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లారు. గురువారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటీ దీపోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హాజరుకానున్నారు. ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో బస చేసి శుక్రవారం శిల్పాకళ వేదికలో జరుగబోయ్యే లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.