27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు

29-03-2026 12:09 AM

మేడ్చల్, మార్చి 28 (విజయక్రాంతి): తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టులు చేశారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయగా మరికొందరిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కుషాయిగూడ, మల్కాజిగిరి, బాలానగర్, సూరారం, షాపూర్ నగర్, కీసర, జవహర్ నగర్, షామీర్పేట్, ఉప్పల్, అల్వాల్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఆశ వర్కర్లను అరెస్టు చేశారు.

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని సిఐటియు మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి కే ఉన్ని కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం హేయమైన చర్య అన్నారు. అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి అక్రమ అరెస్టులను ఖండించారు.