27 May, 2026 | 2:08 AM

రైతన్నపై ధరల పిడుగు

27-05-2026 01:22 AM

ఇంధన రేట్ల పెంపుతో.. వచ్చే వానాకాలంలో పెరగనున్న ఆర్థిక భారం

ఏడాదిలోనే నాలుగుసార్లు పెరిగిన ఎరువుల రేట్లు 

గుబులు పుట్టిస్తున్న ఎల్ నినో

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): యాసంగిలో పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతన్నలు పడుతున్న గోస అంతాఇంతా కాదు. కల్లాల వద్దే అన్నదాత అవస్తలు పడుతున్నాడు. వచ్చేది వానాకాలం సీజన్.. వ్యవసాయం  సాగే దెలా అని రైతన్న ఇప్పటినుంచే మనాదిన ఉన్నాడు. ఈసారి ప్రపంచవ్యాప్త పరిణామాలు అన్నదాతల మెడకు గుదిబండకానున్నాయి.  పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజి ల్ ధరలు పెరగడంతో సాగు ఖర్చులు భారీగా పెరగనున్నాయి.

వానాకాలం సీజన్‌కు ముందే ఎరు వుల ధరలు పెరగడం, మరోవైపు వరి పొలం, దుక్కి దున్నడానికి కావాల్సిన ట్రాక్టర్, ఇతర యంత్రాల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులన్నింటిని తట్టుకుని సాగుకు సిద్ధమవుతుంటే.. ఎల్ నినో ప్రభావంతో ఈ  సీజన్‌లో వర్షాలు తక్కువగా ఉంటాయని వస్తున్న వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలా మారిన పంట ఉత్పత్తులు రానున్న వానాకాలం సీజన్‌లో ఎలా ఉంటాయోనన్న దిగులు అన్నదాతలను ఆవరించింది. 

ఎరువుల రేట్లను ఆయా కంపెనీలు అమాంతం పెంచేశాయి. ఎరువుల రకాలను బట్టి ఒక్కో బస్తాపై రూ.150 నుంచి రూ.400 వరకు పెరిగింది. డీఏపీ, 28- 28 మినహాయించి మిగతా అన్ని రకాల ఎరువుల ధరలు ఆకాశాన్నంటడంతో పెట్టుబడి పెరిగిపోతున్నది. ఈ పెరిగిన ఎరువుల ధరలు మే నెల నుంచే అమల్లోకి వచ్చాయి. యాసంగితో సీజన్ తో పోల్చి తే కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.300, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ధర రూ.125 పెరిగింది.

గడిచిన వానాకాలంలో పోల్చితే ఎరువుల ధరలు రూ.600 ల వరకు పెరిగాయి. పొటాష్ రూ.275కు చేరింది. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పాత ధరలకే లభ్యం కానుం ది. కాగా, ఇటీవల వరి, మొక్కజొన్నకు కేంద్రం పెంచిన మద్దతు ధర కంటి తుడుపు చర్యగా ఉన్నదని, పెట్టుబడి పెరుగుతుండడంతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

19 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు.. 

రాష్ట్రంలో 134 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. దీని కోసం 19 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని భావించి.. ఇప్పటికే సరిపడా ఎరువులను సిద్ధంచేసింది. కేంద్రం నుంచి మరికొంత యూరియా రావాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడి భారంతో కౌలు రైతులు మాత్రం ఈసారి సాగుకు వెనకడుగు వేస్తున్నారు.

ఇప్పటికే అప్పులపాల య్యామని, ఇప్పుడు పెరిగిన ఎరువుల రేట్లతో నష్టం వస్తుందేమేనని భావించి కూలీలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు భరోసా, పంట రుణాలు సకాలంలో రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిం చాల్సి వస్తోందని, దీంతో అప్పులు పెరిగి  వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఎరువుల కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచి తమ ఖజానా నింపుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలను నాలుగు సార్లు పెంచారు. బస్తాపై రూ.150 నుంచి రూ. 400 వరకు దోచుకుంటున్నారు. అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా సమస్యలను సాకుగా చూపించి ధరలను పెంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, వారం, పది రోజుల్లో బస్తాపై మరో రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగే చాన్స్ ఉందని ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.

పెరిగిన ఎరువుల వినియోగం

రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఎరువుల వాడకం భారీగా పెరిగింది. నీటి వనరులు అందుబాటులో ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో ఎరువుల వాడకం రెండింతలైం ది. చాలామంది రైతులు అధిక దిగుబడుల ఆశతో మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తుస్నట్లు తెలుస్తున్నది. మరోవైపు   సీజన్‌లో ఎరువుల కొరత ఉంటుందనే భావనతో కొంతమంది రైతులు రెండు నెలల ముందే స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు.

పెరగనున్న ట్రాక్టర్, ఇతర యంత్రాల ఖర్చు.. 

డీజిల్ రేట్ల పెంపుతో పొలం దున్నడానికి కావాల్సిన ట్రాక్టర్, నాటువేసే యంత్రాలు, వరి కోతలు.. ఇలా అన్ని యంత్రాల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. దిగుబడి కంటే ఖర్చులే అధికమయ్యే పరిస్థితి ఉంది. పొలం దున్నడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోట్రాక్టర్‌కు ప్రస్తుతం  గంటకు రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు తీసుకుంటున్నారు. వచ్చే సీజన్‌లో అదనంగా కనీసం రూ. 200 వరకు పెంచే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

ఇక వరికోత కోసం ఒక గంటకు రూ. 2,300 నుంచి రూ. 2,400 చార్జ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో హర్వేస్టర్ ధరలు పెరు గుతాయని చెబుతున్నారు. వరి నాటుకు ఉపయోగించే యంత్రానికి గంటకు ప్రస్తు తం రూ. 1,000, వరి గడ్డిని కట్టలుగా  చుట్టేందుకు ఒక్కో కట్టకు రూ. 40 వరకు తీసుకుంటున్నారు. భవిష్యత్‌లో వీటి రేట్లు మరింత పెరుగుతాయని, తద్వారా రైతుపై ఆర్థిక భారం తప్పదని రైతులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.