ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి
02-05-2026 08:39 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా ఎన్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ నూతన కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఎల్లంపేట్ మున్సిపల్ అభివృద్ధికి మున్సిపల్ కార్యవర్గ సభ్యుల సహకారంతో అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు. అనంతరం మున్సిపల్ నూతన కమిషనర్ కు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవితో పాటు వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి లు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్.మాజీ ఉప సర్పంచ్ రమేష్ యాదవ్.బిజెపి నాయకులు మేకల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






