calender_icon.png 20 January, 2026 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం

20-01-2026 01:13:36 AM

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే,  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఎస్.పి. నితికా పంత్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, కాగజ్ నగర్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎ.ఎస్.పి. చిత్తరంజన్, కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్యలతో కలిసి హాజరై శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను చేపడుతుందని, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లాలో విద్య, వైద్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. కాగజ్ నగర్‌లో, కౌటాల మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: మంత్రి జూపల్లి

వాంకిడి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లాలోని వాంకిడి మండలం బెండర గ్రామంలో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

జిల్లాలోని వాంకిడి మండలం బెండర గ్రామంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 257 కోట్ల 27 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను  చేపడుతున్నామని చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.