calender_icon.png 8 July, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తృటిలో తప్పిన భారీ ప్రమాదం

12-09-2024 02:25:10 PM

జహీరాబాద్ పట్టణంలోని తాండూర్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై సైడ్ వాల్ కు ఢీకొన్న బస్సు 

సంగారెడ్డి, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని తాండూర్ రోడ్డులో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పై స్టీరింగ్ రాడ్డు విరిగిపోయి అదుపుతప్పి ప్రైవేట్ బస్సు సైడ్ వాల్ కు ఢీకొంది. పట్టణంలోని శివాలయం వద్ద నిలువున్న పిరమిన్ కంపెనీకి చెందిన బస్సు కార్మికులను తీసుకొని వెళ్లేందుకు తాండూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి పట్టణంలోకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ఒకరు ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్లైవుర్ బ్రిడ్జి పై సైడ్ వాళ్లకు ఢీకొని ఒక టైరు బయటకు రావడం జరిగింది. ప్రమాదం జరగడంతో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీ ట్రాఫిక్ సంబంధించింది.