హిందూ ధర్మాన్ని జాగృతం చేసేందుకు జూడో యాత్ర
కుబీర్,(విజయక్రాంతి): భారతీయ సమాజంలో హిందూ ధర్మాన్ని జాగృతం చేసి ధర్మ పరిరక్షణ కోసమే హిందూ జూడో యాత్ర హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు కలికి ఆశ్రమ పీఠాధిపతి సరస్వతి ఆనంద్ మహారాజ్ తెలిపారు. ఈనెల 26న ముధోల్ మండల కేంద్రంలోని బసవ గార్డెన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఋషులు, మహా రుషులు హాజరవుతారని పేర్కొన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణ వీరశైవ లింగాయత్ ధర్మ ప్రచారం. భారతీయ సంస్కృతి సంరక్షణ తదితరు అంశాలపై భక్తులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్ అధ్యక్షులు శంకర్ పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ నాయకులు గణేష్ మారుతి రాం పటేల్ సాయినాథ్ పటేల్.పాండురంగ తదితరులు ఉన్నారు




