బిగ్ బాష్‌లోకి ప్రైవేటు పెట్టుబడులు
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకు లైన్ క్లియర్
మెల్ బోర్న్, సెప్టెంబర్ 8: ఆస్ట్రేలియా టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్(Big Bash League) లోకి ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఈ ప్రైవేటీకరణ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా బిగ్ బాష్ లీగ్‌లోకి సుమారు రూ.8,300 కోట్లకు పైగా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దశగా మెల్బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని పూర్తిగా విక్రయించనున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ పెట్టుబడిదారుల నుండి బిడ్లను ఆహ్వానిస్తోంది. ఈ కొత్త ప్రైవేట్ యాజమా న్యం 2027 బిగ్ బాష్ లీగ్, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ సీజన్ల నుంచి అమలులోకి వస్తుంది. రాబోయే 2026- సీజన్‌పై దీని ప్రభావం ఏమీ ఉండదు.
మిగిలిన బిగ్ బాష్ జట్ల భవిష్యత్తును ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల ని ర్ణయానికే వదిలేశారు. ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆహ్వానించాలా లేదా తమ జట్లలో 49% వరకు వాటాలను విక్రయించాలా అనే విషయాన్ని ఆయా రా ష్ట్ర బోర్డులే స్వయంగా నిర్ణయించుకోవచ్చు. విక్టోరియా, టాస్మేనియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వంటి రాష్ట్రాలు దీనికి మద్దతు ఇస్తుండగా, న్యూ సౌత్ వేల్స్ క్వీన్స్లాండ్ మొదట్లో దీ నిని వ్యతిరేకించాయి. లీగ్‌ను ప్రైవేటీకరించినప్పటికీ, టోర్నమెంట్‌పై పూర్తి పట్టు కోల్పో కుండా క్రికెట్ ఆస్ట్రేలియా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ప్రైవేటీకరణ వల్ల ఐపీఎల్ ఫ్రాం చైజీలు బిగ్ బాష్ జట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.