19-12-2025 08:04:09 PM
విద్యార్థులకు క్విజ్ నిర్వహించి.. విజేతలకు బహుమతి ప్రధానోత్సవం
మేడిపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ యందు బోడుప్పల్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా అనుమతి తో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగముగా శుక్రవారం సెయింట్ ఆన్స్ పి. జీ. కాలేజీ ప్రిన్సిపాల్ జెస్సి, డాక్టర్ సౌజన్య,డాక్టర్ శ్రీనివాస్, పి. జీ. విద్యార్థులతో హై స్కూల్ విద్యార్థులకు శక్తి వనరుల వాడకములో పొదుపు,వాతావరణ కాలుష్యంపై అవగాహన కల్పించడం జరిగినది. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేయడం జరిగినది. అదే విధముగా జిల్లా పరిషత్ స్కూల్ కు 20 ఎల్. ఇ. డి. లైట్స్ హెడ్ మాస్టర్ కు అందచేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ ఇ. శ్యామ్ సుందర్ రావు, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ భార్గవి,జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.