calender_icon.png 19 December, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షమించే తత్వాన్ని ప్రపంచానికి తెలిపిన గొప్ప వ్యక్తి జీసస్

19-12-2025 07:55:16 PM

అచ్చంపేటలో క్రిస్టియన్ భవనానికి స్థలం కేటాయిస్తా 

అచ్చంపేట సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను సెమీ క్రిస్మస్ ఆర్గనైజేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు.తాసిల్దార్ సైదులు పర్యవేక్షణలో నిర్వాహన చేశారు.. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరై మాట్లాడుతూ.. ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి జీసస్ అని  ఆయన చూపిన మార్గం, ప్రతి పాపిని కూడా క్షమించాలనే దయ గుణం ప్రతి ఒక్కరికి ఉండాలని సూచించారు.

అలాగే నాకు ఏ మతం కాదని అన్ని మతాలు సమానమని, క్రీస్తు చూపిన ప్రేమ ఆదరణ చాలా గొప్పదన్నారు. అచ్చంపేట పట్టణంలో వచ్చే ఏడాది నాటికి క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం స్థలం, భవనం ఏర్పాటు చేయిస్తానని అందుకోసం రూపాయలు కోటి మంజూరు చేస్తామని అన్నారు అలాగే నియోజకవర్గంలో ఎక్కడైనా చర్చీలు అసంపూర్తిగా ఉంటే వాటిని ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు తగిన నిధులు ఏర్పాటు చేస్తారని అందుకు నివేదికలు ఇవ్వాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం మైనార్టీ వెల్ఫేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి చర్చికి రూ.30 వేల క్రిస్మస్ పారితోషకం అందజేస్తుందన్నారు.

సెమీ క్రిస్మస్ వేడుకలకు ప్రధాన వక్తగా ప్రసంగికులు బ్రదర్ సునీల్ వర్ధన్ దైవ సందేశం అందజేశారు. అనంతరం క్రిస్మస్ కేకును ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేశారు. అలాగే ప్రతి దైవ సేవకుడికి ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్,, కాశన్న యాదవ్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పాస్టర్లు దైవ సేవకులు, తదితరులు పాల్గొన్నారు..