3 September, 2026 | 4:18 PM

చాణిక్యపురి కాలనీ సమస్యలు పరిష్కరించాలి

03-09-2026 | 02:59pm

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కాలనీవాసుల వినతి

ఉప్పల్ సెప్టెంబర్ 3విజయక్రాంతి: ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్‌లోని చాణిక్యపురి కాలనీకి(Chanakyapuri Colony) సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు మల్కాజిగిరి పార్లమెంట్(Malkajgiri Parliamentary Constituency) సభ్యులు ఈటల రాజేందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. చాణిక్యపురి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎంపీని కలిసి, తమ ప్రాంతంలో చాలా కాలంగా నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వాటి కారణంగా కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీని కోరారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. తమ కాలనీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుని, పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender), సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు శైలేష్ రెడ్డి  చాణిక్యపురి కాలనీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దశరథ్ కిషోర్ గౌడ్    కాలనీవాసులు గంధమల రాములు  కృష్ణ  అక్బర్ తదితరులు పాల్గొన్నారు