7 July, 2026 | 6:21 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

దశలవారీగా కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా

07-03-2026 12:40 PM

షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ 

పలు  వార్డులలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక చర్యలు

షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణం ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని,  దశలవారీగా ఆయా కాలనీలలో సమస్యలను పరిష్కరిస్తానని షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ స్పష్టం చేశారు. శనివారం షాద్ నగర్ మున్సిపాలిటీలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా షాద్ నగర్ పట్టణంలో పలు వార్డులలో ఆయా పరిసరాలను ఆయన మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఆయా కాలనీలలో పారిశుద్ధ కార్మికులతో పాటు మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వo, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొని శుభ్రం చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చర్యలలో భాగంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది సహకారంతో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని 99 రోజుల ప్రణాళికలో అనేక కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ముఖ్యంగా వార్డులలో పారిశుధ్యం పనులకు పెద్దపీట వేస్తామని తెలిపారు. మంచినీరు డ్రైనేజీ సమస్యలు వీధి దీపాలు ప్రభుత్వ భవనాలలో పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిస్తామని చైర్మన్ వివరించారు.