19 April, 2026 | 9:56 AM

కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా బైక్ ర్యాలీ

12-05-2024 02:40 AM

మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి) : మంచిర్యాల మున్సిపాలిటీలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమన్నారు.