ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
07-08-2026 09:23 AM
శంకర్ పల్లి: ఆగస్టు 06(విజయ కాంతి):ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని శంకర్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మెన్ సాత ప్రవీణ్ కుమార్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మునిసిపాలిటీలు, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ యోగేష్, కో- ఆప్షన్ సభ్యులు చెంగల్ బాలకృష్ణ రెడ్డి, ఎండి. మహమూద్, నాయకులు జూలకంటి పాండురంగారెడ్డి, గుండ చంద్రశేఖర్, మున్సిపాలిటీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.






