మత్తుకు దూరంగా ఉంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్
07-08-2026 09:21 AM
భిక్కనూర్,(విజయ క్రాంతి): వ్యసన రహిత భారత నిర్మాణమే ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రధాన లక్ష్యమని బ్రహ్మకుమారీస్ సభ్యులు జయాదీది, గంగాలత అన్నారు. భిక్కనూరులోని శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో "నషా ముక్త్ భారత్" ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ రేణుకుమార్, హెడ్‌మాస్టర్ అశోక్ యాదవ్, బ్రహ్మకుమారీస్ సభ్యులు శెనిశెట్టి రాజలింగం, గుంటుకు రాజు, కోడిప్యాక ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






