విద్యుత్ సరఫరాలో అంతరాయం
07-08-2026 09:26 AM
నిర్మల్ ఆగస్టు 6 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని 11 కేవీ వెంకటాపూర్ ఫీడర్ పరిధిలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్‌రావు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెంకటాపూర్, బృందావన్ కాలనీ, హెచ్‌పీ గ్యాస్ గోదాం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.






