మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి
07-08-2026 09:28 AM
గజ్వేల్: ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తుమ్మ శ్రీనివాస్, దళిత రత్న అవార్డు గ్రహీత పొన్నల కుమార్ మాట్లాడుతూ గద్దర్ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. గద్దర్ జన్మించిన మెదక్ జిల్లాకు ఆయన పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిప్పల యాదగిరి, నీరుడి స్వామి, శివకుమార్, నర్సింగ్, గడ్డం వెంకటేష్, మన్నే కృపానంద్, బాకీ స్వామి, కప్ప పోచయ్య, కన్నా యాదవ్, కప్ప యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






