11 June, 2026 | 3:23 AM

పంట మార్పిడితోనే లాభాలు

11-06-2026 02:21 AM

హాజీపూర్, జూన్ 10: రైతులు పంట మార్పిడి చేయాలని, ఒకే రకం పంట వే యడం వల్ల ఆశించిన దిగుబడి రాదని మం డల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని బుద్దిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ దుర్గం సంధ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు ప్రత్యేక అధికారిగా హాజరై ఆయన మాట్లాడారు.

వరిలో సన్న రకాలు సాగు చేయాలనీ, వరి కొయ్యలు కాల్చవద్దని రైతులకి విజ్ఞప్తి చేశారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పంటల మార్పిడి, మొక్కలు నాటడం, ఓట రు జాబితా సవరణ, ఘన వ్యర్థాల నిర్వహణ, తదితర అంశాలపై విస్తృతంగా చ ర్చించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏ డీ ఏ కృష్ణ, వార్డు సభ్యులు, మండల, గ్రా మ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు పా ల్గొని గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.