28 July, 2026 | 1:50 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారింది

11-06-2026 02:20 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పేద మరి యు మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీపై రేషన్ వస్తువులను అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సాయికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుకు సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బద్రి సాయికుమార్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు భారీ పన్ను రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాన్య ప్రజలపై మాత్రం పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు.

ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, పెరుగుతున్న ఖర్చులతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మార్కెట్లో నల్లబజారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. తిరుపతి, మారం శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కాండ్ర అజయ్ కుమార్, మిస్ చంద్రశేఖర్, కందుల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.