11 June, 2026 | 3:15 AM

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

11-06-2026 02:23 AM

నిర్మల్ జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇంద్రస్థలాలు ఇచ్చి విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘం H 116 రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టు సమస్యలపై ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవే ర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

అర్హులైన జర్నలిస్టులకు అక్డేషన్ కార్డులు ఇండ్ల స్థలా లు ఫీజు రాయితీలు ప్రకటించాలని చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకో వాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రమేష్ ఉపాధ్యక్షులుగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా రాహుల్ జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.