9 March, 2026 | 2:28 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

04-02-2026 08:05 PM

-బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దాస్రు నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు, చెన్నారం సర్పంచ్ రమావత్ తులసిరామ్ 

దేవరకొండ,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దాస్రు నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు, చెన్నారం సర్పంచ్ రమావత్ తులసిరామ్ లు అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తు కొండమల్లెపల్లిలో  పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని  వారు అన్నారు. అక్రమ అరెస్టులు ఆపి అభివృద్ధి చేయాలని  కోరారు. రైతులకు రైతు బంధు అందించాలని వారు డిమాండ్ చేశారు.యూరియా ఇబ్బందులను తొలగించాలని కోరారు.వారి వెంట బిఆర్ ఎస్ పార్టీ నాయకులు,తదితరులు ఉన్నారు.