calender_icon.png 4 December, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కాగా నామినేషన్ల ప్రక్రియ

04-12-2025 01:08:40 AM

సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్

రామయంపేట డిసెంబర్ 3 (విజయ క్రాంతి)మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ పక్కాగా చేపట్టాలని, ఎన్నికల సంఘం నియమాలను పాటించాలని సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ అన్నారు. బుధవారం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆమె సందర్శించారు. రామాయంపేట, నార్సింగి మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించారు.