calender_icon.png 4 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం

04-12-2025 01:09:52 AM

శ్రీ దత్తగిరి పీఠాధిపతి గిరి మహారాజ్

జహీరాబాద్, డిసెంబర్ 3 :భారత భూమి వివిధ సంస్కృతులకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా వెలసిందని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి ఒక 1008 అవధూత గిరి మహారాజ్ అన్నారు. బుధవారం ఝరాసంగం మండలం బర్దిపూర్ లో గల శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం నుండి గణపతి హోమం చండీయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి యజ్ఞక్రతులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి ముక్తి పొందాలంటే భగవంతుని భక్తిశ్రద్ధలతో పూజించాలని, గురువులను గౌరవించాలని, తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించిన నాడే మనిషి మనుగడ సుఖాంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

నేడే దత్త జయంతి...

శ్రీ దత్తగిరి మారాజు ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా యజ్ఞం, యాగాలు నిర్వహించి గురువారం దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దత్త జయంతి రోజు శ్రీ దత్తాచేయాల వారి డోలారోహణ కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సాయంత్రం 6 గంటలకు 21 వేల దీపాలతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆశ్రమ భావి పీఠాధిపతులు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పర్యవేక్షణలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఝరాసంగం ఎస్‌ఐ పటేల్ క్రాంతి కుమార్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.