17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పాకిస్థాన్ డౌన్ డౌన్

26-04-2025 05:45 PM

హిందుస్థాన్ జిందాబాద్...

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గమ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మంది మృతికి కారకులైన పాకిస్తాన్ ఉగ్ర వాదులను హతమార్చాలని డిమాండ్ చేస్తూ దాడికి నిరసనగా శనివారం అశ్వారావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అన్ని రకాల వ్యాపారస్తులు, వివిధ పార్టీల మద్దతుతో సంపూర్ణ బంద్ పాటించారు.

అలాగే స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నుండి కులమతాలకు అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సిపిఎం, సీపీఐ, జనసేన, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పాకిస్థాన్ డౌన్ డౌన్ హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నీ పార్టీలా రాజకీయా నాయకులు వ్యాపారస్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.