2 July, 2026 | 5:40 PM

వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి

02-07-2026 05:01 PM

రోటరీ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): వైద్యులు సేవా భావంతో పనిచేయాలని రోటరీ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే ను క్లబ్ ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జె. వెంకట్ , ఆత్మీయ అతిథిగా కామారెడ్డి ఐఎంఏ అధ్యక్షుడు డా. మల్లికార్జున్ రావు, ప్రోగ్రామ్ చైర్మన్ డా. కె. వెంకట్రాజం , చార్టెడ్ అకౌంట్ రమేష్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు సబ్బని కృష్ణ హరి మాట్లాడుతూ వైద్యవృత్తిని, వృత్తిగా మాత్రమే కాకుండా, సేవాభావంతో రోగుల బాధలను తమ బాధలుగా భావించి రాత్రింబగళ్ళు విశ్రాంతి లేకుండా సేవచేసే మహోన్నత వ్యక్తులు డాక్టర్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణంలో విశిష్ట సేవలు అందిస్తున్న  డాక్టర్ చింత శుభశ్రీ, డాక్టర్ చందరి సంతోష్, డాక్టర్ ఘన శ్యామ్ పటేల్, డాక్టర్ రేనికింది మానస, డాక్టర్ ఎర్రోళ్ల స్నేహ, డాక్టర్ కొంగి దివ్యభారతి, డాక్టర్ పల్స హరీష్ గౌడ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రోటరీ క్లబ్  కార్యదర్శి సోమిశెట్టి సంతోష్, కోశాధికారి మోటూరి బైరయ్య, ఫాస్ట్ ప్రెసిడెంట్ యాచం శంకర్, రాజ నర్సింహారెడ్డి, రోటరీ సభ్యులు బాల కిషన్, బండమీది రాజేశం, దూస వెంకటస్వామి, డాక్టర్ విజయ్ కుమార్, ధనంజయ, వెంకటరమణ, నాగభూషణం, జగన్నాథం, కమ్మరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.