17 April, 2026 | 11:49 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

7న గిరిజన సంక్షేమ భవన్ ఎదుట నిరసన ప్రదర్శన

05-04-2025 12:43 AM

 తెలంగాణ గిరిజన సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్

ముషీరాబాద్,(విజయక్రాంతి): ట్రైకార్ లో 2019-21 సంవత్సరాల్లో మంజూరి అయి చెక్కులు సిద్ధంచేసి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడని లబ్ధిదారులు ఏప్రిల్ 7న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ గిరిజన సంక్షేమ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో  ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడం వలన ట్రై కార్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరాల్లో గిరిజన యువతి యువకుల నుండి వేలాది దరఖాస్తులను స్వీకరించి అందులో నుండి 30 వేల మందికి రుణాలను మంజూరు చేస్తూ లబ్దిదారులుగా గుర్తించిందన్నారు.

వీరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి 219 కోట్ల రూపాయల చెక్కులను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడంతో లబ్దిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కొరకు కొత్తగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి వెళితే ఇప్పటికే రుణాలు తీసుకున్నట్టు చూపిస్తూ ఆన్ లైన్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని ఆరోపించారు. దీనితో వేలాది మంది గిరిజన యువత రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాలు పొందకుండా అనర్హులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మంది యువతకు రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పతకాన్ని ప్రారంభించి మోసం చేయడం తగదన్నారు.