19 March, 2026 | 6:26 AM

ఎర్రకుంట చెరువును సుందరీకరణ చేస్తాం

19-03-2026 01:51 AM

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 18 : పట్టణంలోని ఎర్రగుంట చెరువును పూర్తిస్థాయిలో సుందరీకరిస్తామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలో 31వ,32వ డివిజన్ లోని ఎర్రకుంట చెరువుని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఎర్రకుంట చెరువు ను పున రుద్ధరణ చేసి చుట్టూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ప్రజలకు పర్యాటకులకు ఆకర్షణయుతంగా ఉండేలా రూపొందించలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేషన్ కమిషనర్ రామంజుల రెడ్డి, ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెన్నెల రఘు, 32వ డివిజన్ ఇంచార్జ్ కనికే శ్రవణ్ కుమార్ , మురళి, రమేష్, చందు, వేణు,వెంకటేష్, సిద్దు, రాకేశ్, అంజి,చిన్న, తదితరులు పాల్గొన్నారు.