27 February, 2026 | 12:43 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

25-02-2026 12:00 AM

కుమ్రం భీం  ఆసిఫాబాద్/కాగజ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యాయులను ఆదేశించారు.

మంగళవారం ఆయన మార్లావాయి గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు), సిర్పూర్ ఈఎంఆర్‌ఎస్ కళాశాల (బాలుర), కాగజ్నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలురు)లను సందర్శించి విద్య, భోజన, వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు.

పదో తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన చేయాలని, ఈఎంఆర్‌ఎస్ విద్యార్థులు ఐఐటీ, జేఈఈ వంటి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. వసతి గృహాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.