పీఆర్‌టీయూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిఆర్టియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మనోహర్ రావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము ఉపాధ్యాయుల శ్రేయస్సు కాంక్షించే సంఘం పిఆర్టియు తెలంగాణ అని అన్నారు.
సంఘ బలోపేతానికి అందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర, జిల్లా బాధ్యులు, గిరి, శ్రీధర్ రావు, నరసింహారెడ్డి, సురేందర్, రాము, ఎల్లా గౌడ్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...




