10 April, 2026 | 1:56 AM

ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసిన బీజేపీ నాయకులు

10-04-2026 12:00 AM

బాన్సువాడ, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్ ను గురువారం బాన్సువాడ బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు.

ఆస్పత్రిలో సిబ్బంది నియామకం ఆసుపత్రికి వచ్చే రోగులను నిజామాబాద్ కు రిఫర్ చేయకుండా బాన్సువాడ లోనే వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆంబులెన్స్ లోనే రోగులను నిజాంబాద్ కు తరలించాలని ప్రైవేట్ అంబులెన్స్ నియంత్రణ కట్టడి చేపట్టాలని ఆసుపత్రి వచ్చే రోగుల పట్ల మెరుగైన వైద్య సేవలు అందించి సహకరించాలని వారు కోరారు.

సానుకూలంగా స్పందించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ భాస్కర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కో ఆప్షన్ మెంబర్ తృప్తి శివప్రసాద్, కౌన్సిలర్లు గజ్జల మహేష్, పాశం భాస్కర్ రెడ్డి, సామల శ్రీకాంత్, చీకట్ల రాజు తదితరులు ఉన్నారు.